SRPT: సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చివ్వేంల మండలం ఐలాపురం, సూర్య తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొంథా తుఫాన్ వల్ల తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టి 17% తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఇన్ఛార్జీలకు ఆదేశించారు. తనిఖీలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో సంతోష్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.