HYD: జూబ్లీహిల్స్లో తమ పార్టీ బలహీనంగా ఉన్నందున ఓటమిని విశ్లేషించుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని ప్రజలు ఓటేశారని ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామన్న ఆయన, భవిష్యత్తులో జీహెచ్ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే తమ లక్ష్యమన్నారు.