NZB: జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల నుంచి మొత్తం 20 దరఖాస్తులు వచ్చాయి.అనంతరం ఫిర్యాదుదారుల సమస్యలను సీపీ ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కార మార్గాలను చూడాలని ఆదేశించారు.