KNR: రామడుగు మండల కేంద్రంలో ఇటీవల జరిగిన దుర్ఘటనలో పాఠశాల బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయిన బాలుడు మామిడి సాత్విక్ కుటుంబాన్ని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి తండ్రి మామిడి రాజు, తల్లి దీపతో ఎమ్మెల్యే మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తమ కుమారుడిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.