మంచిర్యాల: మందమర్రి పట్టణం దొర్ల బంగ్లా ఏరియాకి చెందిన మానుపాటి సంపత్ అనే వ్యక్తి గుడుంబా అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి అతని దగ్గర 2 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ASI శ్రీనివాస్ తెలిపారు. అతను మళ్లీ ఎలాంటి నేరం చేయకుండా సత్ప్రవర్తనతో ఉండుటకు గాను శుక్రవారం MRO ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు.