ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు వివరాలు ప్రాజెక్టు AEE హరీశ్ మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు గాను ప్రస్తుతం 277.40 మీటర్లు ఉందన్నారు. నీటి సామర్థ్యం 0.571 TMCలకు ప్రస్తుతం 0.451 TMC ఉందన్నారు.రాత్రి కురిసిన వర్షంతో 2 గేట్లు ఎత్తి 5416 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని తెలిపారు.