SRD: సిర్గాపూర్ మండలంలో భూములు కొనుగోలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై మహేశ్ శుక్రవారం హెచ్చరించారు. మండల పరిధిలో కొంతమంది దళారీలు రైతులతో కలిసి ఎక్కడో లోయలో గుట్టల్లో ఉన్న భూములను రోడ్డుపక్కనే ఉన్నట్లు చూపించి తక్కువ ధరకు వస్తుందని నమ్మించి మోసం చేస్తున్నారని తెలిపారు. పట్టా బుక్ డాక్యుమెంట్స్, భూమిని చూడకుండా కొనుగోలు చేస్తే చిక్కుల పడతారన్నారు.