నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఇంగు శ్రీనివాస్ రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తనప్రతిభను చాటి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆదివారం HYDలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా నిలిచిన శ్రీనివాస్‌ను జిల్లా ప్రజలు, ఫోటోగ్రాఫర్లు అభినందిస్తున్నారు.