JNG: స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. MLA కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ప్రతిఒక్కరికి అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.