SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లడ్డూలకు బూజు పట్టిన ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన సమగ్ర విషయాలు అందజేయాలని ఆలయ అధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అయితే ఎక్కడా ఎటువంటి లోపం జరగలేదని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.