HNK: జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్కతుర్తి జంక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కుడా వైస్ ఛైర్మన్ అశ్విని తానాజీ వాక్కడేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.