MNCL: సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని జనవరి 1 నుంచి 3 వరకు బహుజన జ్ఞాన జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తిరుమల రాజ్, గోమాస రాజసమ్ములు తెలిపారు. గురువారం మంచిర్యాలలో వారు పోస్టర్లు విడుదల చేశారు. జ్ఞాన జాతరలో భాగంగా జనవరి 1న భీమా కరగాం అమరుల దినం, 2న పిల్లలకు పోటీలు, 3న సావిత్రిబాయి ఫూలే జన్మదిన సంబరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.