SRD: అనంతారం గ్రామ రైతుల భూమి సమస్యను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. గ్రామంలోని సర్వే నెంబర్ 173, 174కు చెందిన పట్టా భూములను ప్రభుత్వం ఇటీవల సర్కార్ భూములుగా నమోదు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ విషయమై ఫిర్యాదు చేశారు.