మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం దొడ్డుపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను గ్రామస్తులు ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏకగ్రీవ తీర్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ఎన్నిక జరగకుండా ప్రజా ప్రతినిధులు నిర్ణయం తీసుకోవడంతో గ్రామస్తులతో పాటు మండల అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.