WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్య శారద హాజరై, విగ్రహాలను పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత వహించాలని ఆమె సూచించారు.