NRML: నిర్మల్ మండలం అనంతపెట్ కేజీబీవీ పాఠశాలలో పదిమంది విద్యార్థులు ఉడికి ఉడకని అన్నం తిని విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడడంతో వీరిని శుక్రవారం రాత్రి ఎంఈఓ వెంకటేశ్వర్లు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించి పాఠశాలకు పంపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగా విధుల్లో చేరిన వంట సిబ్బందితో భోజనం వండటంతో ఇబ్బంది ఏర్పడింది.