HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఉన్న దుకాణాలపై స్పెషల్ డ్రైవ్లో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు స్పెషల్ రిపోర్టు విడుదల చేశారు. ఇందులో భాగంగా ఐదుగురికి నోటీసులు అందించామని, 12 మందికి జరిమాణాలు విధించినట్లుగా తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.