MNCL: భీమారం ఎస్సై శ్వేత భీమారం మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ప్రాముఖ్యత, నేరాల నియంత్రణలో వాటి పాత్రను ప్రజలకు వివరించారు. ప్రతి గ్రామంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, తద్వారా నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.