KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డీసీసీ అధ్యక్షుల నియామకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్నను ఖమ్మం జిల్లా అధ్యక్షురాలుగా ఏఐసీసీ ప్రకటించింది.