HYD: ఓల్డ్ మలక్పేట డివిజన్ పరిధిలోని వహద్ నగర్లో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల సోమవారం పరిశీలించారు. రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యంతో పాటు ఒక ప్రాణాన్ని కూడా కాపాడినట్లు అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.