కామారెడ్డి: అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని BVM రాష్ట్ర కార్యదర్శి విఠల్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి పలువురు ఉపాధ్యాయులు కావాలని వారికి కావాల్సిన చోటకు డిప్యూటేషన్లను జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతో చేసుకుంటున్నారని ఆరోపించారు. డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేసి విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.