KMM: భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎ.బి బర్ధన్ శత జయంతి సందర్భంగా బుధవారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో సీపీఐ పార్టీ జిల్లా నేతలు అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతరం జరిగిన సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ.. వామపక్ష పార్టీల బలోపేతానికి ఆయన నిరూపమాన సేవ చేశారని కొనియాడారు.