భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఉన్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ప్రకటించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని చెప్పారు. ప్రజలు ఫిర్యాదులు సమర్పించడానికి రేపు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.