ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ స్వగృహ కరుణగిరి ప్రాంతాల్లో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 500 మందికి టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని సేవా పక్వాడ్ జిల్లా కోఆర్డినేటర్ రమేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్ శ్యామ్ రాథోడ్ సరస్వతి పాల్గొన్నారు.