WNP: తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కొనియాడారు. గురువారం ఐలమ్మ జయంతి సందర్భంగా వనపర్తి పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, గడ్డం వినోద్, పాల్గొన్నారు.