JN: ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొడకండ్ల మండలం నీలిబండ గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షుడు దేవా అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి అతని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.