KMM: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి బి. సుమన్ చక్రవర్తి తెలిపారు. ‘శాంతి’ అంశంపై ఈ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. అలాగే, ఈనెల 28వ తేదీన పాఠశాల విద్యార్థినుల కోసం పులిగుండాల (కనకగిరి గుట్ట) టూర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.