SRD: మనూరు మండలం బోరంచలో నల్ల పోచమ్మకు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థిర వాసరే పురస్కరించుకొని అర్చకులు సిద్దు స్వామి మూలవిరాట్ దేవికి పంచామృతాలు, మంజీరా నది గంగాజలంతో అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణలో విశేష పూజలు చేపట్టారు. అమ్మవారిని కొలిచేందుకు దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.