MBNR: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు టెస్టుల్లో నిర్ధారణ కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని శనివారం కౌకుంట్ల మండలం బీజేపీ సీనియర్ నాయకులు సింగారపు కృష్ణా రెడ్డి అన్నారు. దీనిపై ప్రత్యేకమైన కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని హిందూ ధర్మ పరిరక్షణ కోసం బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు.