WNP: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి రేవల్లి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి నేతలు పూలమాలలువేసి జయంతి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నేతలు ఆమె పోరాటపటిమను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాడాల పర్వతాలు, దాసరాజుల శ్రీనివాసులు, వెంకటస్వామి, రజక సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.