SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జడ్పిటిసి కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, ఆ మహనీయుని జీవితం రేపటి తరాలకు ఆదర్శప్రాయం అన్నారు.