కొండా లక్ష్మణ్ బాపూజీ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని, ఆస్తులను దానం చేశారని బిసి కమిషన్ ఛైర్మన్ రాజయ్య కొనియాడారు. శుక్రవారం కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాపూజీ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్లు పాల్గొన్నారు.