HNK: మానసిక సామర్థ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ విధిని ఎదిరించి తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి జీవన్జీ ప్రపంచానికి ఆదర్శమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు అన్నారు. సోమవారం అథ్లెట్ దీప్తి, ఆమె కుటుంబ సభ్యులు మురళీధర్ రావుని హైదరాబాద్లోని ఎంపీ, ఎమ్మెల్యేస్ కాలనీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.