»Upi Transaction Upi Will Not Be Free For Them In The Next Three Years
UPI Transaction: వచ్చే మూడేళ్లలో వాళ్లకు యూపీఐ ఉచితం కాదు!
వచ్చే మూడేళ్లలో పెద్ద వ్యాపారులకు యూపీఐ పేమెంట్స్‌కి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ దిలీప్ ఆస్బే వెల్లడించారు.
UPI Transaction: ప్రస్తుతం అందరూ యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారు. రోజులో ఎన్నోసార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తుంటాం. అయితే వచ్చే మూడేళ్లలో పెద్ద వ్యాపారులు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ దిలీప్ ఆస్బే వెల్లడించారు. ఈ యూపీఐ వ్యవస్థలోకి మరో 50 కోట్ల మందిని తీసుకురావాల్సి ఉందన్నారు.
భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని తెలిపారు. దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా యూపీఐ చెల్లింపులపై సహేతుక ఛార్జీలు వసూలు చేయాలన్నది ప్రతిపాదనగా తెలిపారు. అయితే చిన్న వ్యాపారుల జోలికి వెళ్లకుండా, పెద్ద వ్యాపారులకు వచ్చే మూడేళ్లలో ఛార్జీలు వసూలు చేస్తమని ప్రతిపాదించారు. సైబర్, భద్రత, సమాచార భద్రత కోసం బ్యాంకులు ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులను 10-25% పెంచాలని అభిప్రాయపడ్డారు.