»The Facebook Logo Has Changed Do You Know What Other Changes Have Been Made
Facebook లోగో మారింది.. ఇంకా ఏం మార్పులు చేశారో తెలుసా.?
సోషల్ మీడియాలో ఫేస్ బుక్కు ఉండే స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకప్పుడు అది చాలా మందికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేది కాని ఇప్పుడు చాలా యాప్స్ రావడంతో దాని ప్రాధాన్యత తగ్గింది. చాలా మందికి దాన్ని మంచి ప్లాట్ ఫామ్‌గా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఫేస్ బుక్ లో జరిగిన ఓ చేంజ్ వైరల్‌గా మారింది.
The Facebook logo has changed.. Do you know what other changes have been made?
Facebook: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్(Facebook) చరిత్ర ఈనాటిది కాదు. దాదాపు రెండు దశబ్దాలకు పైగా యూజర్లతో కనెక్టింగ్లోనే ఉంది. దాని స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) ఇన్స్టాగ్రామ్(Instagram)ను ఫేస్‌బుక్‌తో అనుసంధానం చేసిన తరువాత ఇన్స్టాగ్రామ్ ప్రాధాన్యత పెరిగింది. ఫలితంగా ఈ ప్లాట్ ఫామ్ కాస్త వెనుకబడింది. చాలా రోజులుగా ఫేస్బుక్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కానీ తాజాగా దాని లోగోను మార్చింది యాజమాన్యం. ప్రస్తుతం మరింత ప్రకాశవంతంగా మారింది లోగో. ఇప్పటివరకు ఎఫ్ అనే తెల్లని అక్షరం చుట్టూ లేత నీలం రంగు ఉండేది. ఇప్పుడు ముదురు నీలం రంగులో కనిపిస్తోంది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేదు. మార్చిన తరువాత కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. లోగో రంగును మరింత షైనీగా మార్చడంతో ఫేస్ బుక్ యూజర్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎన్నో ఏళ్లుగా లైట్ బ్లూ కలర్ లోగోను కొనసాగిస్తున్న వారు ఇప్పుడు బ్రైట్ నెస్ తో కూడిన లోగోతో కాస్త కొత్తగా కనిపిస్తోంది. యూజర్లను కనెక్ట్ చేసే ఈ ప్లాట్ ఫామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఒకే చోట కలిసే వేదికగా దీన్ని ప్రజలు చూశారు. గతంలో కూడా ఫేస్ బుక్ ప్రేమల గురించి ఎన్నో చూశాము. ఖండాలు దాటి మరీ వివాహాలు కేవలం ఫేస్ బుక్ పరిచయం వలన జరిగాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ యాప్‌ను కమర్షియల్‌గా వాడుతున్నారు. ఇందులో పెడుతున్న కంటెంట్‌కు మానిటైజేషన్ కూడా కలిపిస్తుండడంతో అనేక సంస్థలు దీన్ని తమ కంటెంట్ షేరింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా ఇన్నాళ్లకు ఫేస్ బుక్‌లో ఒక మార్పు వచ్చిందని, ఇకపై మార్క్ దీన్ని మరింత అభివృద్ధి పరుస్తారని వినియోగదారులు భావిస్తున్నారు. అలాగే ఎక్స్ యాప్ పాత ట్విట్టర్ కు పోటీగా తీసుకొచ్చిన థ్రెడ్స్ అనుకున్న విజయం సాధించలేదు. దీంతో మెటా కంపెనీ దీనిపై ఫోకస్ పెట్టిందా అని నెటిజనులు చర్చించుకుంటున్నారు. ఇదే నిజమైతే ఫేస్ బుక్ నుంచి వినూత్న మార్పులను చూసే అవకాశం ఉంది.