»Zimbabwe Ostrich People Strange People With Only Two Toes
Zimbabwe Ostrich People : కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉండే వింత ప్రజలు..ఎక్కడంటే
మనుషుల కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉంటాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇక్కడొక జాతి ప్రజలందరికీ ఇటువంటి వేళ్లే ఉన్నాయి. కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉండటంతో వీరిని ఆస్ట్రిచ్ కాళ్ల మనుషులని అంటారు. ఈ తెగ ప్రజలు ఎక్కడ నివశిస్తున్నారో తెలుసుకోవాలంటే ఇది మీరు కచ్చితంగా చదవాల్సిందే.
మనుషుల కాళ్లకు ఐదు వేళ్లు ఉంటాయి. కానీ కొందరికి మాత్రం ఆరు వేళ్ల వరకూ ఉంటాయి. అయితే ఇక్కడొక ప్రాంతంలో నివశించే ప్రజలకు మాత్రం అలా లేవు. వారి కాళ్లకు రెండంటే రెంటే వేళ్లు ఉన్నాయి. వారి కాళ్లను చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ నివశించేవారందరి కాళ్లకు రెండే వేళ్లు ఉండటం ప్రపంచంలోని వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ తెగ మనుషులు ఆఫ్రికాలో మనకు కనబడుతారు.
ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వేలో ఇటువంటి మనుషులు ఉన్నారని చాలా మందికి తెలియదు. కన్యెంబా ప్రాంతంలో డొమా తెగలో ప్రజల కాళ్లకు రెండే వేళ్లు ఉంటాయనే సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తెగ ప్రజలను వడోమా తెగ అని అంటారు. అలాగే వీరికి మరో పేరు కూడా ఉంది. బంట్వానా అని కూడా ఈ తెగవారిని పిలుస్తుంటారు. ఈ తెగలో అందరికి ఒకేవిధంగా రెండు వేళ్లే ఉంటాయి. వారి కాళ్లు అచ్చంగా నిప్పు కోడి కాళ్లలాగే ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కాళ్లకు రెండు వేళ్లు ఉండటం వల్ల వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా అంటారు. అరుదైన జన్యుపరమైన రుగ్మత వల్లే వారి కాళ్లకు రెండే వేళ్లు ఉంటాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. వారికి ఉన్న ఆరోగ్య సమస్యని ఎక్ట్రోడాక్టిలీ అని అంటారని, వారికి ఉన్న ఆ సమస్య వల్ల తెగకు చెందిన వారికి వివాహాలు జరగటం కూడా కష్టమైపోతోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వారి కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉండటం వల్ల ఇతర తెగల మహిళలు పెళ్లి చేసుకునేందుకు ముందుకు రారు. అలాగే ఈ తెగ మహిళలను పెళ్లాడటానికి బయటివారు సాహసం చేయరు.
ఈ తెగ ప్రజల కాళ్లకు రెండు వేళ్లే ఉండటం వల్ల నడవటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వీరు సరిగా నడవలేరు. అయితే వీరు చెట్లను ఎక్కడంలో మాత్రం ఎటువంటి ఇబ్బందీ పడరు. చాలా వేగంగా చెట్లను వీరు ఎక్కగలరు. అందుకే వీరి లోపాన్ని వారి ఉపాధిగా మలచుకున్నారు. చెట్లు ఎక్కి కాయలు, పండ్లను కోసి వాటితోనే బతుకుతుంటారు.