Tech Layoffs: కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు మొదలయ్యాయి. చిన్న, పెద్ద కంపెనీలని తేడా లేకుండా అన్ని కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాదిలానే ఈ ఏడాది కూడా ఉద్యోగులను తొలగిస్తుంది. ఏడాది మొదట్లోనే దాదాపు 32 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. తాజాగా స్నాప్ 540 మందిని తీసేసింది. అంతకుముందు ఓక్టా అనే సాఫ్ట్వేర్ సంస్థ 400 మందిని ఇంటికి పంపించింది. అమెజాన్, సేల్స్‌ఫోర్స్, మెటా ప్లాట్‌ఫామ్స్ వంటి పెద్ద సంస్థలు కూడా ఉద్యోగాల కోత విధించనుంది.
కరోనా సమయంలో డిమాండ్‌కు బట్టి టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వ్యవస్థాపకుడు రోజర్ లీ తెలిపారు. ఉద్యోగాలు తీసేయడానికి ప్రధాన కారణం ఆర్థిక పరిస్థితులే అని లీ తెలిపారు. కృత్రిమమేధ వైపు రూపాంతరకం చెందాల్సిన అవసరం వల్ల మానవ వనరులను క్రమబద్ధీకరించాల్సి వస్తుందని కొన్ని కంపెనీలు చెబుతున్నాయన్నారు. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరిగినట్లు తెలిపారు. కొన్నరకాల పోస్టులు తీసివేస్తున్నప్పటికీ.. మరికొన్ని రంగాల్లో నియామకాలు పుంజుకుంటున్నాయని తెలిపారు.