amazon to sell its offices after firing 18000 employees
ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ మాట తప్పించి వేరే వినిపించడం లేదు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తో పాటు అతి పెద్ద ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా వేల మందిని ఒకేసారి తొలగించింది. దాదాపు 18 వేల మంది ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ కాస్ట్ కటింగ్ లో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగించింది.
ఇప్పుడు ఏకంగా కంపెనీ బిల్డింగ్ లను కూడా అమ్మకానికి పెట్టింది అమెజాన్. ఉద్యోగులను తీసేశాక ఖాళీగా ఉన్న ఆఫీస్ బిల్డింగ్ లపై కంపెనీ కన్ను పడింది. దీంతో కాలిఫోర్నియాలో ఉన్న ఖాళీ ఆఫీసును అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. 2021 లో ఈ ఆఫీసును అమెజాన్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 2021 లో ఈ ఆఫీసును 123 మిలియన్ యూఎస్ డాలర్లకు కొనుగోలు చేసింది. అంటే మన కరెన్సీలో సుమారు వెయ్యి కోట్లు. దాన్ని అమ్మేసి కంపెనీ నష్టాన్ని పూడ్చుకోవాలని అమెజాన్ యోచిస్తోంది.