• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »టెక్

ఐఫోన్ 17e వచ్చేసింది

ఐఫోన్ 17e ని యాపిల్ సంస్థ ఆవిష్కరించింది. ఏ19 చిప్‌సెట్, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా కలిగిన ఈ ఫోన్‌కు 17 సిరీస్‌లో తక్కువ ధరకు నిర్ణయించారు. రూ.64,900 నుంచి ఈ ఫోన్ లభించనుంది. ఈనెల 4న ముందస్తు ఆర్డర్లు ప్రారంభిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 11 నుంచి డెలివరీ చేస్తామని పేర్కొంది. 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్, USB-C వైర్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

March 3, 2026 / 12:56 PM IST

అమెజాన్ డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్ల దాడి

తమ డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన మాట వాస్తవమేనని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ధ్రువీకరించింది. UAEలోని రెండు సెంటర్లపై నేరుగా, బహ్రెయిన్‌లోని మరో సెంటర్ సమీపంలో ఈ దాడులు జరిగాయి. దీనివల్ల భారీగా మంటలు చెలరేగి భవనాలు దెబ్బతినడమే కాకుండా, విద్యుత్ సరఫరా నిలిచిపోయి సర్వీసులకు అంతరాయం కలిగింది. టెక్ ప్రపంచంలో ఈ దాడి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

March 3, 2026 / 11:43 AM IST

రికార్డ్ స్థాయిలో ఈవీ సేల్స్.. TVS హవా!

ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు 1,11,680 యూనిట్లతో 46% వృద్ధిని నమోదు చేశాయి. 31,600 యూనిట్ల అమ్మకాలతో TVS మోటార్ అగ్రస్థానంలో నిలవగా, బజాజ్(25,323), Ather(20,581) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్ 12,512 యూనిట్లతో 4వ స్థానంలో ఉంది. ఒకప్పటి అగ్రగామి ఓలా ఎలక్ట్రిక్ కేవలం 3,968 యూనిట్లతో 6వ స్థానానికి పడిపోగా, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 5వ స్థానంలో నిలిచింది.

March 3, 2026 / 09:34 AM IST

బైక్ ఓనర్లకు GOOD NEWS

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాత BS3, BS4 మోడళ్ల కోసం ‘E20 రెట్రోఫిట్ కిట్’ను విడుదల చేసింది.  20% ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల పాత బైక్‌ల రబ్బర్, మెటల్ భాగాలు దెబ్బతినకుండా ఈ కిట్ కాపాడుతుంది. BS3, BS4 మోడళ్లకు ఇది సరిపోతుంది. కేవలం రూ.1,700 ధరతో లభించే ఈ కిట్‌లో ఓ-రింగ్స్, ట్యూబ్స్, సీల్స్ ఉంటాయి. ఈ కిట్‌తో ఇథనాల్ వల్ల కలిగే తుప్పు సమస్యను అరికట్టవచ్చు.

March 3, 2026 / 09:14 AM IST

యుద్ధం.. పెరిగిన ఇంధన ధరలు

పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఖతార్ ఉత్పత్తి నిలిపివేత, ఇరాన్ దాడుల ప్రభావంతో యూరప్‌లో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోవడంతో LNG సరఫరా దెబ్బతిని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు, తయారీ రంగంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది.

March 2, 2026 / 09:20 PM IST

యమహా XSR155 ‘మెటాలిక్ బ్లాక్’ లాంచ్

యమహా ఇండియా XSR155 మోడల్‌లో కొత్త ‘మెటాలిక్ బ్లాక్’ బైక్‌ను రూ.1,58,990(ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. గోల్డెన్ USD ఫోర్క్స్, రెట్రో స్టైలింగ్‌తో వచ్చిన ఈ వేరియంట్ మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. అయితే, లాంచ్ అయిన 3 నెలల్లోనే కంపెనీ ధరలను పెంచింది. ప్రస్తుతం ఈ బైక్ ధరలు రంగును బట్టి రూ.1.50-1.59L మధ్య ఉన్నాయి. రెడ్ కలర్ ధర రూ.1.53 లక్షలకు చేరింది.

March 2, 2026 / 01:56 PM IST

మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్ వచ్చేసింది

1965 మోంటే కార్లో ర్యాలీ విజేతకు నివాళిగా ‘మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్’ను భారత్‌లో లాంచ్ చేశారు. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎక్స్‌క్లూజివ్ చిలీ రెడ్ పెయింట్, బోనెట్‌పై వైట్ స్ట్రైప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ స్పెషల్ ఎడిషన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు వింటేజ్ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

March 2, 2026 / 12:30 PM IST

కొత్త రంగుల్లో KTM RC160

KTM ఇండియా RC 160 బైక్‌లో ‘ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మ్యాట్’, ‘సిరామిక్ వైట్ మ్యాట్’ అనే రెండు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. పాత ధర రూ.1.85 లక్షలకే ఇవి లభిస్తాయి. 164.2cc ఇంజన్, ఆల్-ఎల్ఈడీ లైటింగ్, ఎల్‌సీడీ క్లస్టర్ వంటి ఫీచర్లలో ఎలాంటి మార్పు లేదు. యమహా R15 తో పోటీ పడుతున్న ఈ బైక్, దానికంటే సుమారు రూ.19,000 ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది.

March 2, 2026 / 12:10 PM IST

పెట్రోల్ వినియోగదారులకు GOOD NEWS

ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్‌కు కనీసం 95 ఆక్టేన్ (RON) రేటింగ్ ఉండాలని కేంద్రం తప్పనిసరి చేసింది. 20% ఇథనాల్ బ్లెండింగ్ (E20) వల్ల ఇంధన నాణ్యత మెరుగుపడనుంది. ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ఆక్టేన్ స్థాయి 91-92 నుంచి 97-98 వరకు పెరుగుతుందని చమురు సంస్థలు తెలిపాయి. దీనివల్ల వాహన ఇంజన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.

March 2, 2026 / 11:57 AM IST

ట్రయంఫ్ 350cc బైక్‌.. లాంచ్ ఎప్పుడంటే?

బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ ట్రయంఫ్ 350cc బైక్‌లను ఏప్రిల్‌లో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించారు. ప్రస్తుత 400cc ఇంజిన్‌ను తగ్గించి ఈ కొత్త వెర్షన్ రూపొందిస్తున్నారు. దీనివల్ల 40% నుంచి 18% వరకు జీఎస్టీ తగ్గి, ధరలు మరింత పోటీగా ఉండనున్నాయి. ఇదే వ్యూహాన్ని KTM, Dominor మోడళ్లలోనూ అనుసరించే అవకాశం ఉంది. తక్కువ ధరలో ప్రీమియం బైక్ కోరుకునే వారికి ఇది గుడ్ న్యూస్.

March 2, 2026 / 11:44 AM IST

మార్చిలో కొత్త కార్ల సందడి

మార్చిలో భారత ఆటోమొబైల్ రంగం కొత్త మోడళ్లతో కళకళలాడనుంది. రెనాల్ట్ డస్టర్(మార్చి 17) రీ-ఎంట్రీ ఇస్తుండగా, లగ్జరీ విభాగంలో మెర్సిడెస్ V-క్లాస్(మార్చి 2), ఆడి SQ8 పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో వస్తున్నాయి. వీటితో పాటు స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్, టొయోటా ఎబెల్లా EV SUVలు మార్కెట్లోకి వస్తాయి. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు కస్టమర్లకు భారీ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.

February 28, 2026 / 05:13 PM IST

కారు కొంటే రూ.10 వేలు.. కొత్త సెస్‌

TG: రాష్ట్రంలో వాహన కొనుగోలుదారులకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వం మార్చి 1 నుంచి రోడ్డు భద్రత సెస్ అమలు చేయాలని నిర్ణయించింది. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద నివారణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల చట్టం యాక్ట్ 1963కు సవరణలు చేసిన నేపథ్యంలో ఈ కొత్త సెస్ అమల్లోకి రానుంది.

February 27, 2026 / 02:42 PM IST

ప్రైవసీ డిస్‌ప్లేతో శాంసంగ్ S26 అల్ట్రా.. ధర ఎంతంటే?

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ S26 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ S26 అల్ట్రాతో పాటు S26, S26+ మోడళ్లను తీసుకొచ్చింది. గెలాక్సీ S26 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్5, 5000mAH బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. S26 అల్ట్రా (12GB+256GB వేరియంట్) ప్రారంభ ధర రూ.1,39,999, 12GB+512GB వేరియంట్ ధర రూ.1,59,999, 16GB+1TB వేరియంట్ ధర రూ.1,89,999గా నిర్ణయించారు.

February 26, 2026 / 07:43 PM IST

హ్యుందాయ్, కియా, BMW కార్లు రీకాల్

ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్, కియా, BMW కొరియా భారీ రీకాల్‌ ప్రకటించాయి. తయారీ లోపాల కారణంగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో 37 మోడళ్లకు చెందిన 1,07,158 వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హ్యుందాయ్ 37,690, కియా 1,590, BMW కొరియా సంస్థ 520i, 320i సహా 32 మోడళ్లకు చెందిన 67,878 కార్లను రీకాల్ చేస్తోంది.

February 25, 2026 / 11:10 AM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ వచ్చేస్తోంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బ్రాండ్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి ఈవీ సబ్ బ్రాండ్ Flying Flea. మొదటి మోడల్ Flying Flea C6.. 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. రూ.2 లక్షల నుంచి రూ.2.5-3 లక్షల మధ్య ధర ఉండొచ్చని అంచనా.

February 22, 2026 / 01:59 PM IST