ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్, కియా, BMW కొరియా భారీ రీకాల్ ప్రకటించాయి. తయారీ లోపాల కారణంగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో 37 మోడళ్లకు చెందిన 1,07,158 వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హ్యుందాయ్ 37,690, కియా 1,590, BMW కొరియా సంస్థ 520i, 320i సహా 32 మోడళ్లకు చెందిన 67,878 కార్లను రీకాల్ చేస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బ్రాండ్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి ఈవీ సబ్ బ్రాండ్ Flying Flea. మొదటి మోడల్ Flying Flea C6.. 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. రూ.2 లక్షల నుంచి రూ.2.5-3 లక్షల మధ్య ధర ఉండొచ్చని అంచనా.