»Cross Chatting Ban On Facebook And Instagram December Middle 2023
Facebook and Instagram:లో చాటింగ్ బంద్
ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ యాప్ లలో మీరు ఎక్కువగా క్రాస్ చాటింగ్ చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈనెల తర్వాత ఈ రెండు యాప్స్ మధ్య క్రాస్ చాటింగ్, కాల్స్ చేయడం కుదరదని సంస్థ ప్రకటించింది.
cross Chatting ban on Facebook and Instagram december middle 2023
మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని మెటా, ఇన్ స్టా గ్రామ్ విషయంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ మధ్య నుంచి Instagram, Facebook Messengerలలో క్రాస్ చాటింగ్ చేయలేరని సంస్థ ప్రకటించింది. అంతేకాదు ఈ యాప్స్ ద్వారా కొత్తగా కాల్స్ చేయడం లేదా చాట్ చేయడం కుదరదని తెలిపింది. అయితే ఇప్పటికే చాట్ చేసిన చాటింగ్ ఉంటుంది కానీ ఆ తర్వాత చేయడానికి యాక్సిస్ ఉండదని సంస్థ ప్రకటించింది. అయితే సంస్థ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం మాత్రం తెలియలేదు.
మెసెంజర్లో ఇంటర్‌ఆపరేబిలిటీ కోసం DMA అవసరాలకు అనుగుణంగా మెటా ఈ నిర్దిష్ట క్రాస్ యాప్ చాటింగ్ ఫీచర్‌ను నిలిపివేస్తోందని ఊహాగానాలు వస్తున్నాయి. వివిధ మెసేజింగ్ సేవల మధ్య మెరుగైన సపోర్టును ఎనేబుల్ చేస్తూ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా మెటా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చర్య భాగం కావచ్చని టెక్ వర్గాలు అంటున్నాయి. భారత్‌పై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం సహా చైనా నుంచి పెరుగుతున్న నకిలీ ఫేస్బుక్ ఖాతాలపై మెటా కూడా ఒక నివేదికను విడుదల చేసింది. వీటన్నింటిని పరిష్కరించాల్సిన క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2020లో ప్రారంభించబడిన ఈ ఫీచర్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ నుంచి ఇన్ స్టాకు సందేశాలు, కాల్స్ చేసుకునేందుకు అనుమతి ఉంది. ఆపై వాటిని దాని అన్ని ఉత్పత్తులకు అందుబాటులోకి తెచ్చారు. నిజానికి క్రాస్-ప్లాట్‌ఫారమ్ మెసేజింగ్ ప్రారంభం, ఇన్స్టాగ్రామ్ DMలు అంతకుముందు మెసెంజర్-ప్రత్యేకమైన అనేక ఫీచర్లను అందుకోవడంతో సమానంగా ఉన్నాయి. ఇందులో వానిషింగ్ మెసేజ్‌లు, సెల్ఫీ స్టిక్కర్లు వంటివి ఉంటాయి. తాజా నిర్ణయంతో ఫేస్ బుక్ నుంచి ఇన్ స్టాకు, ఇన్ స్టా నుంచి ఫేస్ బుక్ కు చాటింగ్, కాల్స్ చేయడం కుదరదు.