పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ నేరాలపై కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విభాగం పరిశీలన చేపట్టింది. అక్రమ పెట్టుబడులు, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా వెబ్సైట్లపై కేంద్ర ఐటీ శాఖ నిషేధించింది.
Websites: అక్రమ పెట్టుబడులు, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా వెబ్సైట్లపై కేంద్ర ఐటీ శాఖ నిషేధించింది. పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ నేరాలపై కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విభాగం పరిశీలన చేపట్టింది. చాలా వెబ్సైట్లలో వర్క్ ఫ్రం హోమ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని గుర్తించిన కేంద్ర ఐటీ శాఖ ప్రత్యేక అధికారాలతో 100కి పైగా వెబ్సైట్లపై నిషేధం విధించింది. డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్స్, రెంటెడ్ అకౌంట్లను వినియోగించి ఈ కార్యకలాపాలు చేస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక నేరాలను ప్రోత్సహిస్తున్న ఈ వెబ్సైట్లను విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు ఐటీశాఖ ప్రకటనలో తెలిపింది.
ఇలా ఆర్థిక మోసాలు నుంచి వచ్చిన సొమ్మును క్రిప్టో కరెన్సీ, విదేశీ ఏటీఎం కార్డులు, ఇంటర్నేషనల్ ఫిన్‌టెక్ కంపెనీల సాయంతో మనీలాండరింగ్ చేస్తున్నారని ఐటీశాఖ గుర్తించింది. ఎక్కువగా ఇంట్లోనే కూర్చుని సంపాదన అనే ప్రకటనలతో సైబర్ నేరగాలు యూజర్లను ఆకట్టుకుంటున్నారు. ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. అలాంటి యాడ్స్ క్లిక్ చేయగానే వారి ఏజెంట్లు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మాధ్యమాల్లో యూజర్లతో మాట్లాడుతున్నారు. వీడియోలు లైక్ చేయడం, సబ్‌స్క్రైబ్ చేయడం, రేటింగ్ ఇవ్వడం వంటివి చేస్తూ ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించవచ్చని యూజర్లను మభ్యపెడుతున్నారు. మొదటిగా కొంత కమీషన్ ఇచ్చి తర్వాత లాభాలను ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయవద్దని సూచించింది.