చైనాకు చెందిన బైడు కంపెనీ ఎర్నీ బాట్ చాట్ జీపీటీని ఆవిష్కరించింది. లాంచింగ్ కార్యక్రమంలోనే నెగిటివ్ వచ్చింది. ఎక్కువ మంది లేకపోవడం, ప్రీ రికార్డెడ్ వీడియోలు పొందుపరచడంతో నెగిటివ్ వెళ్లింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పడిపోయాయి.
China Baidu Unveil: ఆర్టిషిపీయల్ ఇంటెలెజెన్స్ చాట్ జీపీటీ తర్వాత మరొకొన్ని ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. చైనాకు చెందిన బైడు (Baidu) నుంచి వస్తోన్న ఎర్నీ బాట్ (Ernie Bot) గురించి కొద్దీరోజుల నుంచి చర్చ జరుగుతుంది. చివరికీ ఎర్నీ బాట్‌ను బైడు ఆవిష్కరించింది. ప్రారంభం అయినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే అందులో అప్పటికే రికార్డ్ చేసిన వీడియోలను వాడారట. జనం మధ్యలో లాంఛ్ చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో షేర్లు రాలేదు. దీంతో కంపెనీ షేర్లు కుప్పకూలాయి.
ఆల్పాబెట్ ఇంక్ గూగుల్ ఇ-మెయిల్, క్లౌడ్ సాప్ట్వేర్ కోసం ఏఐ సాధనాలను ఆవిష్కరించాయి. రెండురోజుల తర్వాత అమెరికా ప్రత్యర్థి చైనా తన ఎర్నీ బాట్‌ను (Ernie Bot) ప్రారంభించింది. దాదాపు గంటపాటు ప్రదర్శన ఇచ్చింది. అంతగా ఆకట్టుకోలేకపోయింది. గత ఏడాది నవంబర్‌లో చాట్ జీపీటీ (chat gpt) ఫ్రీగా చాట్ బోట్ లాంఛ్ చేసింది. బైడు మాత్రం వీడియోలు.. మ్యాథేమటికల్ కాలెక్యులేషన్స్, చైనా మాండలికంలో మాట్లాడటం, టెక్ట్స్‌తో వీడియో, ఫోటోలు రూపొందించి షార్ట్ వీడియోలను ప్రదర్శించింది.
Lors du Dialogue au Mont Ni, Robin Li, fondateur et PDG de Baidu, a déclaré que les applications des nouvelles technologies s’enracinent dans les normes et la règlementation et que seule la mise en place de lois et règlements, de systèmes institutionnels et de principes moraux. pic.twitter.com/ciPRT1gSr7
బైడుకు చెందిన ఎర్నీ బాట్ గురువారం నుంచి ఇన్విటేషన్ కోడ్ ఉన్నవారికి మత్రమే ఓపెన్ అయ్యింది. బైడు క్లౌడ్ ఫ్లామ్ ఫామ్ ద్వారా తమ ఉత్పత్తులు కావాలంటే ఆప్లై చేసుకోవాలని సూచించింది. కొందరికీ ఓపెన్ చేసే అవకాశం ఇవ్వడం మైనస్ అయ్యింది. దీంతో బైడు యొక్క హాంగ్‌కాంగ్ షేర్లు 10 శాతం పతనం అయ్యాయి. కంపెనీ షేర్లు 6.4 శాతం ముగిశాయని సీఈవో రాబిన్ లీ తెలిపారు. దీంతో ఆ కంపెనీ విలువ 3 బిలియన్లకు పైగా క్షీణించింది. ప్రజలు చూసిన ఇంటరాక్టివ్ సెషన్‌గా కాకుండా స్క్రిప్ట్‌గా ప్రజంటేషన్ ఉందని మార్నింగ్ స్టార్ ఆనలిస్ట్ కై వాంగ్ అన్నారు. సాప్ట్‌గా ప్రారంభించిన తేదీ కూడా లేదని.. ఇవన్నీ మార్కెట్ ప్రతికూల భావాలను కారణమైందని వివరించారు.