»A New Feature From Youtube Watch Page For Reliable News
YouTube: విశ్వసనీయ వార్తల కోసం యూట్యూబ్ నుంచి కొత్త ఫీచర్!
యూట్యూబ్ నుంచి మరొక ఫీచర్ ఇంకొన్ని రోజుల్లో రానుంది. విశ్వసనీయ వార్తల కోసం వాచ్ పేజీ అనే కొత్త ఫీచర్(watch page feature)ను తీసుకొస్తున్నట్లు ఈ సంస్థలో పనిచేసే ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే నకిలీ వార్తలను కట్టడి చేసేందుకే ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
A new feature from YouTube watch page for reliable news
గూగుల్ యాజమాన్యంలోని ప్రముఖ సంస్థ యూట్యూబ్(YouTube) నుంచి సరికొత్త ఫీచర్ రాబోతుంది. విశ్వసనీయ వార్తలను తెలుసుకునేందుకు “వాచ్ పేజీ” ఫీచర్ ను తీసుకురానున్నట్లు తెలిసింది. అయితే ఇది రాబోయే మరికొన్ని నెలల్లో భారతదేశంలో అమల్లోకి వస్తుందని ఆ కంపెనీకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఫేక్ వార్తలను అరికట్టడంతో భాగంగానే ఈ ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఫేక్ యూట్యూబ్ ఛానెళ్లను అరికట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వెలువరించిన తర్వాత యూట్యూబ్ నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం.
అయితే ప్రస్తుతం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనం వీక్షించే కంటెంట్ ను బట్టి వచ్చే వీడియోలతోపాటు వార్తలు, ఇతర అంశాలు మనకు కన్పిస్తాయి. ఈ క్రమంలోనే వార్తల కోసం వాచ్ పేజీ ఫీచర్(watch page feature)ను తీసుకొస్తున్నట్లు యూట్యూబ్ ఇండియా పబ్లిక్ పాలసీ అధికారి మీరా ఛత్ చెప్పారు. మీరా తాజాగా జరిగిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్లో పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు.
ఇటీవల ప్రభుత్వం యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌లో నకిలీ వార్తా ఛానెల్‌లను గుర్తించాలని కోరింది. అయితే, యూట్యూబ్ కమ్యూనికేషన్లో భాగంగా ప్రభుత్వం “ఫేక్ న్యూస్(fake news)”ని నిర్వచించలేదని సోర్సెస్ తెలిపింది. అయితే ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య భారతదేశంలో ఈ ప్లాట్‌ఫారమ్ విధానాలను ఉల్లంఘిస్తున్న 2 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించిందని ఆమె తెలిపింది. ఈ క్రమంలోనే భారత్‌లో రాబోయే నెలల్లో యూట్యూబ్‌లో వాచ్ పేజీ ఫీచర్ ను విడుదల చేయనున్నట్లు మీరా ఛత్ చెప్పారు.