Smriti Mandhana : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధానకు బెస్ట్ ర్యాంకు
ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్లు సత్తా చాటారు. కెరీర్ బెస్ట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఐసీసీ( ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్ తహిలా మెక్‌గ్రాత్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్లు సత్తా చాటారు. కెరీర్ బెస్ట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఐసీసీ( ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్ తహిలా మెక్‌గ్రాత్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma)(613 పాయింట్లు) పదో స్థానం దక్కించుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (599 పాయింట్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)(598పాయింట్లు) 12, 13 స్థానాల్లో ఉన్నారు. వికెట్ కీపర్ రీచా ఘోష్ కెరీర్ బెస్ట్ ర్యాంకు (20) అందుకుంది. వరల్డ్ కప్‌లో 19 ఏళ్ల రీచా అద్భుతంగా రాణిస్తోంది. ఐర్లాండ్‌తో మ్యాచ్ తప్ప మిగతా మూడు మ్యాచుల్లో 31, 44, 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ టాప్ 5లో నిలిచారు.
ఇంగ్లండ్ (England) బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ (784 పాయింట్లు) టాప్ ప్లేస్‌లో ఉంది. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma ) (733 పాయింట్లు), రేణుకా సింగ్ (711 పాయింట్లు) వరుసగా నాలుగు, ఐదు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. టీమిండియా బౌలర్ స్నేహ్ రాణా 671 పాయింట్లతో 12వ స్థానం దక్కించుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగింది. పొట్టి ప్రపంచ కప్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మహిళా క్రికెటర్‌గా గుర్తింపు సాధించింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2023 (T20 World Cup 2023)లో భారత ఓపెనర్ స్మృతి మంధాన సత్తాచాటుతోంది. ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలంలో స్మృతి మంధాన(Smriti Mandhana)ని రూ.3.4 కోట్లకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలానే ఆర్సీబీకి కెప్టెన్‌గా కూడా స్మృతీని ఆ ఫ్రాంఛైజీ ఇటీవల ప్రకటించింది.
టీ20 వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన 56 బంతుల్లో 87 పరుగులు చేసి భారత్ జట్టు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ క్రమంలో సెమీస్ బెర్తుని కూడా ఖాయం చేసుకున్న భారత ఉమెన్స్ టీమ్(Women’s Team). ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌లో(T20 World Cup)భారత్ ఉమెన్స్ టీమ్ వరుసగా పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లని ఓడించినా.. ఇంగ్లాండ్ టీమ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ.. ఐర్లాండ్‌పై 5 పరుగుల తేడాతో గెలవడం ద్వారా సెమీస్ బెర్తుని ఖాయం చేసుకుంది. గురువారం నుంచి సెమీస్ (semis) మ్యాచ్‌లు జరగనున్నాయి.