భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల దులీప్ ట్రోఫీలో భారీ ఇన్నింగ్స్‌తో ముషీర్ ఆకట్టుకున్నాడు. తండ్రితో పాటు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని.. ప్రమాదంలో గాయాలు కావడంతో వచ్చే ఇరానీ ట్రోఫీలో ఆడటం కష్టమేనంటూ ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి.