Virat Kohli: మిస్ అయిన సెంచరీ.. కోహ్లీ ఫ్రస్టేషన్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వన్డే కప్‌లో మొదటి మ్యాచ్ నిన్న ఆసీస్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ మిస్ కావడంతో.. ఫస్ట్రేషన్లో ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.
Virat Kohli:క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచకప్ ప్రారంభమయ్యిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని మరి భారత్ విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ 2 పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. టీమిండియాతోపాటు అభిమానులు కూడా కాస్త కంగారుగానే ఉన్నారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ పిచ్‌పై బ్యాటింగ్ కూడా కాస్త కష్టంగానే ఉందని ఆసీస్ బ్యాటింగ్ చూసి చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రాహుల్ మ్యాచ్‌ను ముందుకు నడిపించారనే చెప్పవచ్చు.
టీమిండియా స్కోర్ 20 ఉన్నప్పుడు కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను మిచెల్ మార్ష్ వదిలేశాడు. ఒక్క క్యాచ్ ఎంత విలువైనదో ఆస్ట్రేలియాకు అప్పుడు అర్థం అయ్యింది. కోహ్లీ ఇలా 75 బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 80 పరుగులు దాటిన తర్వాత కోహ్లీ మరో సెంచరీ చేయబోతున్నాడని ఫ్యాన్స్ భావించారు. ఊహించని విధంగా కోహ్లీ క్యాచ్ ఇచ్చి.. నిరాశగా పెవిలియన్ చేరాడు. 78వ సెంచరీ మిస్ అయ్యిందని కోహ్లీ డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన వెంటనే ఫ్రస్టేషన్‌తో రెండు చేతులతో తల బాదుకున్నాడు. కోహ్లీ తల బాదుకున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.