Women’s T20 : రెండో టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఘనవిజయం
మహిళల టీ20 (Women's T20) ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమ్ఇండియా(Team India) అదే ఉత్సాహంతో వెస్టిండీస్‌ని(West Indies) ఓడించింది.
మహిళల టీ20 (Women’s T20) ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమ్ఇండియా(Team India) అదే ఉత్సాహంతో వెస్టిండీస్‌ని(West Indies) ఓడించింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన (10), జెమీమా రోడ్రిగ్స్ నిరాశపర్చగా.. షెఫాలీ వర్మ(Shefali Verma) (28; 23 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harman Preet) (33; 42 బంతుల్లో 3 ఫోర్లు), రిచా ఘోష్ (44; 32 బంతుల్లో 5 ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. విండీస్ బౌలర్లలో కరిష్మా రెండు వికెట్లు పడగొట్టగా.. హేలీ మాథ్యూస్, హెన్రీ తలో వికెట్ తీశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (2), హెన్రీ (2), ఫ్లెచర్ (0) నిరాశపర్చినా.. స్టాఫానీ టేలర్ (42; 40 బంతుల్లో 6 ఫోర్లు), షెమైన్ (30; 36 బంతుల్లో 3 ఫోర్లు) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించారు. చెదియన్ (21), షబికా (15) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో మెరవగా.. రేణుక సింగ్, (Renuka Singh) పూజ వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది. టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది.