నేడు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ఆరంభం నుంచి వరుస షాట్లతో దూసుకుపోయారు. శుభ్ మన్ గిల్ తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే 13వ ఓవర్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ 16వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా 17 ఓవర్లలో 95/2 స్కోరుతో ఉంది. బ్రేక్ తర్వాత టీమిండియా బ్యాటర్లు మంచి ఫామ్ తో చెలరేగారు. అయితే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఔట్ అవ్వడంతో భారత్ స్కోర్ 175/4గా ఉంది.