»Swiss Mens Doubles Title Won By Sathwik And Chirag
Sathwik Chirag : స్విస్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ – చిరాగ్
భారత స్టార్ షట్లర్లు సాత్వక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy) - చిరాక్ శెట్టి (Chirag Shetty) స్విస్ ఓపెన్ పురుఘల డబుల్స్ టైటిల్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన రెన్ గ్జియాంగ్ యూ, టన్ క్వియాంగ్(Ton Qiang) ద్వయంపై గెలుపొందారు. నువ్వా నేనా అన్నట్టుగా 54 నిమిషాలు సాగిన టైటిల్ పోరులో 21-19, 24-22తో విజయం సాధిందారు. దాంతో, ఈ ఏడాది తొలి టైటిల్ను తమ ఖాతాలో వేసుకున్నారు.
భారత స్టార్ షట్లర్లు సాత్వక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy) – చిరాక్ శెట్టి (Chirag Shetty) స్విస్ ఓపెన్ పురుఘల డబుల్స్ టైటిల్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన రెన్ గ్జియాంగ్ యూ, టన్ క్వియాంగ్(Ton Qiang) ద్వయంపై గెలుపొందారు. నువ్వా నేనా అన్నట్టుగా 54 నిమిషాలు సాగిన టైటిల్ పోరులో 21-19, 24-22తో విజయం సాధిందారు. దాంతో, ఈ ఏడాది తొలి టైటిల్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటివరకు సాత్విక్ – చిరాగ్ జంటగా ఆడి ఐదు వరల్డ్ టూర్ టైటిళ్లను గెలిచారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో రెండో సీడ్ అయిన సాత్విక్ – చిరాగ్ మలేషియా (Malaysia) జోడీని చిత్తు చేశారు.